- Advertisement -
బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ధేశించిన 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలో పెద్ద షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ విరాట్ కోహ్లీ(6), లొమ్రోర్(0)ల వికెట్లను తీసి చెన్నై బౌలర్లు బెంగళూరును దెబ్బ కొట్టారు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ తో కలిసి మరో ఓపెనర్ డు ప్లెసిస్(48) చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. వరుస బౌండరీలతో విరుచుకుపడున్నాడు. మాక్స్ వెల్(34) కూడా బ్యాట్ ఝుళిపిస్తుండడంతో స్కోరు బోర్డు వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం బెంగళూరు 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
- Advertisement -