- Advertisement -
బెంగళూరు: ఐపిఎల్ 16వ సీజన్ లీగ్ లో భాగంగా ఇక్కడి చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది.మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిని బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ బౌలింగ్ ఎంచుకుని, చెన్నై జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపటిల్స్ జట్టుపై గెలుపొందిన బెంగళూరు, చెన్నై జట్టును కూడా ఓడించి విజయ పరంపరను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన చెన్నై, బెంగళూరుపై విజయం సాధించి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
- Advertisement -