Monday, January 20, 2025

IPL 2023: ముంబయిపై బెంగళూరు ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఘనవిజయం సాధించింది. పరుగుల రారాజు విరాట్‌కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ ఓపెనింగ్ జోడీ ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు. డుప్లెసిస్ 43బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సులతో 73పరుగులు, కోహ్లీ 6ఫోర్లు, 5సిక్సులతో 82పరుగులు చేసి ఆర్‌సిబి విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్‌పై 8వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. చివర్లో మ్యాక్స్‌వెల్ 3బంతుల్లో రెండు సిక్సర్లుతో 12పరుగులు చేసి మెరిశాడు.

కాగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 7వికెట్లకు 171 పరుగులు చేసింది. తెలుగు క్రికెటర్ తిలక్‌వర్మ ఒంటరిపోరాటం చేసి ముంబై ఇండియన్స్‌ను ఆదుకున్నాడు. 46బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లతో 84పరుగులు చేయడంతో ముంబై మెరుగైన స్కోరు నమోదు చేసింది. హిట్‌మ్యాన్ రోహిత్ (1), ఇషాన్‌కిషన్ (10), గ్రీన్ (5), సూర్య (15) నిరాశపరిచారు. అనంతరం ముంబై నిర్దేశించిన 172పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16.2 ఓవర్లలో 2వికెట్లు నష్టానికి చేసి గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News