Monday, December 23, 2024

మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ దూకుడు.. రాజస్థాన్‌పై బెంగళూరు విజయం

- Advertisement -
- Advertisement -

మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ దూకుడు
రాజస్థాన్‌పై 7పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు
బెంగళూరు: ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్‌పై 7పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 9వికెట్ల నష్టానికి చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లీ డకౌట్ అయినా డుప్లెసిస్ అర్ధశతకాలతో అదరగొట్టారు. మ్యాక్స్‌వెల్ 44బంతుల్లో 6ఫోర్లు, 4సిక్స్‌లతో 77పరుగులు, డుప్లెసిస్ 39బంతుల్లో 8ఫోర్లు, 2సిక్స్‌లతో 62పరుగులు చేసి మెరిశారు. వికెట్ కీపర్ కార్తీక్ 16పరుగులతో రెండంకెల స్కోరు నమోదు చేయగా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ , సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా చాహల్ తలో వికెట్ పడగొట్టారు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కాగా 190పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి వద్ద నిలిచిపోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 37బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లతో 47పరుగులు, దేవదత్ పడిక్కల్ 34బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్స్‌తో 52పరుగులతో హాఫ్‌సెంచరీ చేసి ఆకట్టుకున్నారు. ధ్రువ్ 16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లతో 34పరుగులు చేసి నిలిచినా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు.. సిరాజ్, డేవిడ్ విల్లీ తలో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News