Monday, January 20, 2025

13 బంతుల్లోనే యశస్వి హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

యశస్వి వీర విహారం
13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కోల్‌కతాపై రాజస్థాన్ ఘన విజయం
కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ (57) ఒక్కడే రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 98 (నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌కు రికార్డు విజయం అందించాడు. ఈ క్రమంలో 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి పెను ప్రకంనలు సృష్టించాడు. చెలరేగి ఆడిన యశస్వి 47 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, 13 ఫోర్లతో అజేయంగా 98 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ 48 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News