Monday, December 23, 2024

IPL: బట్లర్‌కు షమీ షాక్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్ నిర్దేశించిన 178పరుగుల లక్షచేధనలో రాజస్థాన్ ఓపెనర్లు నిరాశపరిచారు. యశస్వి జైశ్వాల్(1)ను హార్దిక్ ఔట్ చేయగా, బట్లర్(0)ను షమీ డకౌట్ చేశాడు. ఈ క్రమంలో పడిక్కల్, కెప్టెన్ సంజూ శాంసన్ సంయమనంతో ఆడి మరో వికెట్ పడకుండా జట్టును ఆదుకున్నారు. 33బంతుల్లో 43పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు.

ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. 25బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లతో 26పరుగులు చేసిన పడిక్కల్ ను రషీద్ ఔట్ చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(49), హెట్ మెయర్(18)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News