Monday, January 20, 2025

IPL 2023: లక్నోపై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా జైపూర్ వేదిగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ గేయింట్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకుని, లక్నో జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

కాగా, ఇరు జట్లు వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్, లక్నో జట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News