Friday, April 4, 2025

IPL: నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై.. రుతురాజ్ గైక్వాడ్ అర్థ శతకం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి ఐపిఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుపు బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు.

ఈ క్రమంలో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. అయితే, మిగతా ఆటగాళ్లు అతనికి అండగా నిలబడలేకపోతున్నారు. మొయిన్ అలీ(23), అంబటి రాయుడు(12), కాన్వే(1), బెన్ స్టోక్స్(7)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పర్చారు. ప్రస్తుతం చెన్నై 13 ఓవర్లలో నాలుగు వికెట్ కోల్పోయి 121 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(76), శివమ్ దూబే(0)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News