Sunday, December 22, 2024

IPL 2023: సంజూ శాంసన్ డకౌట్.. మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2023లో భాగంగా ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్(10) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పడిక్కల్ తో కలిసి మరో ఓపెనర్ జోస్ బట్లర్ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

Also Read: ఫ్రీగా ఐపిఎల్ టికెట్లు: జై షాను అడుక్కోమన్న ఉదయనిధి స్టాలిన్

ఈ క్రమంలో భారీ షాట్ కు యత్నించి పడిక్కల్(38) పెవిలియన్ చేరాడు. తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్(0) కూడా వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ జట్టు 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్(37), రవిచంద్రన్ అశ్విన్(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News