Thursday, December 26, 2024

ఢిల్లీపై సన్‌రైజర్స్ ప్రతీకారం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో తొలి ప్లేఆఫ్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాజయానికి సన్‌రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 67 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ 53 (నాటౌట్), అబ్దుల్ సమద్ (28), అకిల్ హుస్సేన్ 16 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.

Also Read: అగ్రస్థానానికి గుజరాత్..

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ (59), మిఛెల్ మార్ష్ (63) అర్ధ సెంచరీలతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్ బౌలర్లు కీలక సమయంలో రాణించి ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. మయాంక్ మార్కాండే 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది మూడో విజయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News