Wednesday, January 22, 2025

IPL 2023: ఢిల్లీతో సన్ రైజర్స్ పోరు.. ఇరుజట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023 లీగ్ దశలో భాగంగా సోమవారం సాయంత్రం నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఓటమితో టోర్నీని ప్రారంభించిన సన్ రైజర్స్ తర్వాత పుంజుకుని రెండు వరుస విజయాలతో జోరు చూపించింది. దీంతో సన్ రైజర్స్ జట్టుపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. పుంజుకున్నట్లే కనిపించిన సన్ రైజర్స్ వరుస ఓటములతో తీవ్రంగా నిరాశపర్చింది.

Also Read: రహానె మెరుపులు.. కోల్‌కతాపై చెన్నై ఘన విజయం

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లో రెండు మాత్రమే గెలిచిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు, ఢిల్లీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్ లో కేవలం ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిచి తిరిగి రేసులో నిలబడాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News