Friday, December 20, 2024

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. పంజాబ్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హైదరాబాద్ బలహీనంగా కనిపిస్తోంది. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News