Saturday, December 21, 2024

వెంకటేశ్ అయ్యర్ అర్థ శతకం.. విజయం దిశగా కోల్ కతా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా జట్టు విజయం దిశగా దూసుకుపోతోంది. గుజరాత్ విధించిన 205 పరుగుల లక్ష్య చేధనలో కోల్ కతా జట్టు 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయినా వెంకటేష్ అయ్యర్, నితిష్ రాణా(45)లు చెలరేగిపోయారు.

ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో వెంకటేష్ అయ్యర్ అర్థ శతకం నమోదు చేశారు.రాణా కూడా దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కోల్ కతా 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(64), రింకు(1)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News