Monday, December 23, 2024

వార్నర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే ఐపిఎల్ సీజన్‌లో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహించిన విషయం తెలిసిందే. తాజాగా వార్నర్‌కు మరోసారి కెప్టెన్సీ వరించింది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌పై భారీ నమ్మకం పెట్టుకుని సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఐపిఎల్‌లో వార్నర్‌కు ఉన్న రికార్డును దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

నిజానికి ఈ సీజన్‌లో ఢిల్లీకి రిషబ్ పంత్ సారథ్యం వహించాల్సి వచ్చింది. కానీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పట్లో అతను తిరిగి క్రికెట్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ ఆటగాడు వార్నర్‌వైపు ఢిల్లీ యాజమాన్యం మొగ్గు చూపింది. అతని సారథ్యం ఢిల్లీ ఐపిఎల్‌లో బరిలోకి దిగనుంది.

గర్వంగా ఉంది..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎంపిక కావడంపై డేవిడ్ వార్నర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఢిల్లీ వంటి బలమైన జట్టుకు సారథ్యం వహించడాన్ని అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నా. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజయపథంలో నడిపించడమే తన ముందున్న ఏకైక లక్షం. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు సర్వం ఒడ్డి పోరాడుతానని వార్నర్ హామీ ఇచ్చాడు. ఐపిఎల్ వంటి మెగా టోర్నీలో ఓ జట్టుకు సారథ్యం వహించడం ఎప్పుడైనా గర్వంగానే ఉంటుందన్నాడు. తనకు మరోసారి ఇలాంటి అవకాశం రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయిందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News