Monday, April 7, 2025

IPL 2023: చెలరేగిన కాన్వే.. పంజాబ్ లక్ష్యం 201

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2023లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

ఓపెనర్ కాన్వే(92 నాటౌట్) భారీ అర్థ శతకంతో మెరుపులు మెరిపించాడు. కాన్వేతోపాటు మరో ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్(37), శివమ్ దూబే(28)లు రాణించగా.. చివర్లలో కెప్టెన్ ధోనీ(13 నాటౌట్) రెండు భారీ సిక్సులతో చెలరేగాడు. దీంతో చెన్నై, పంజాబ్ జట్టుకు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News