Friday, December 20, 2024

గుజరాత్‌తోనే హార్దిక్ పాండ్య

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ కోసం డిసెంబర్ 19న క్రికెటర్ల మినీ వేలం పాట జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఐపిఎల్‌లోని పది ఫ్రాంచైజీలు రిటెన్షన్, రిలీజ్ క్రికెటర్ల జాబితాను విడుదల చేశాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్‌తోనే కొనసాగనున్నాడు. హార్దిక్‌కు గుజరాత్‌ను వదులుకుంటుందని, అతన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందని మీడియాలో కథనాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెడుతూ గుజరాత్ హార్దిక్‌ను రిటెన్ చేసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్‌లను అంటిపెట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంగ్లండ్ క్రికెటర్ హారి బ్రూక్‌ను వదులుకుంది. కిందటి వేలం పాటలో బ్రూక్‌ను సన్‌రైజర్స్ భారీ ధరను వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

వచ్చే ఐపిఎల్ సీజన్‌కు దూరంగా ఉంటానని ప్రకటించడంతో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది. ఇక రాజప్థాన్ టీమ్ జో రూట్ (ఇంగ్లండ్)ను రిలీజ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముస్తాఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా, రోసోవ్, రోమన్ పొవెల్, మనీష్ పాండేలను రిలీస్ చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ షకిబ్ అల్ హసన్, శార్దూల్ ఠాకూర్, లిటన్ దాస్, సౌథి, ఫెర్గూసన్, మన్‌దీప్ సింగ్ వంటి స్టార్ క్రికెటర్లను వదులుకుంది. లక్నో టీమ్ డేనియల్ సామ్స్, కరుణ్ నాయర్, జయదేవ్ ఉనద్కత్ తదితరులను రిలీజ్ చేసింది. ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్, రిచర్డ్‌సన్, మెరిడిత్, జోర్డాన్‌లను వదులుకుంది. గుజరాత్ యశ్ దయాల్, కెఎస్ భరత్, శివమ్ మావి, అల్జారీ జోసెఫ్ తదితరులను వదిలిపెట్టింది.

ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన క్రికెటర్లు వీరే..

సన్‌రైజర్స్ హైదరాబాద్: హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తిక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హోసేన్, ఆదిల్ రషీద్.
పంజాజ్ కింగ్స్: భానుక రాజపక్స, మోహిత్ రాథీ, అగద్ బవా, షారూక్ ఖాన్, బాల్తేజ్.
చెన్నై సూపర్ కింగ్స్: అంబటి రాయుడు, ప్రిటోరియస్, జేమిసన్, స్టోక్స్, భగత్ వర్మ, సేనాపతి, సిసింది మగల, ఆకాశ్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్: జో రూట్, హోల్డర్, బాసిత్, ఆకాశ్ వశిస్ఠ్, కుల్దీప్ యాదవ్, మెక్‌కాయ్, మురుగన్ అశ్విన్, కరియప్ప, ఆసిఫ్.
ఢిల్లీ క్యాపిటల్స్: ముస్తఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా, రొమన్ పొవెల్, మనీష్ పాండే, నాగర్ కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్.
కోల్‌కతా నైట్‌రైడర్స్: షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీజ్, జగదీశన్, మన్‌దీప్ సింగ్, ఖజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, చార్లెస్, టిమ్ సౌథి.
గుజరాత్ టైటాన్స్: యశ్ దయాల్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, సంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దాసున్ శనక.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: హాజిల్‌వుడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, పార్నల్, సోనూ యాదవ్, కేదార్ జాదవ్, సిద్ధార్థ్ కౌల్, అవినాష్ సింగ్.
ముంబై ఇండియన్స్: అర్షద్ ఖాన్, రమన్‌దీప్ సింగ్, హృతిక్ షోకీస్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్యూన్ జాన్‌సెన్, రిచర్డ్‌సన్, మెరిడిత్, సందీప్ వారియర్, జోర్డాన్.
లక్నో సూపర్ జెయింట్స్: ఉనద్కత్, డేనియల్ సామ్స్, మన్నన్ వోహ్రా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, గులేరియా, షేడ్జే, కరుణ్ నాయర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News