Monday, December 23, 2024

ఐపిఎల్ సీజన్ 17లో అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ సీజన్ 17లో అరుదైన రికార్డు నమోదైంది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా వెయ్యి సిక్సర్లు నమోదైన సీజన్‌గా 2024 టోర్నమెంట్ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌లక్నో జట్ల మధ్య బుధవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు బద్దలైంది. ఐపిఎల్‌లో చరిత్రలో కేవలం ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే వెయ్యికి పైగా సిక్సర్లు నమోదయ్యాయి.

2022లో (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు) నమోదు కాగా, తాజాగా ఈ సీజన్‌లో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. అయితే ఐపిఎల్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో వెయ్యి సిక్సర్లు ఈ సీజన్‌లో నమోదయ్యాయి. 2022లో (16269) బంతుల్లో, 2023లో 15390 బంతుల్లో వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి. అయితే ఈసారి మాత్రం 13079 బంతుల్లోనే ఇది నమోదు కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News