Wednesday, January 22, 2025

పంజాబ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జానీ బెయిర్‌స్టో (46), రిలి రొస్సొ (43), శశాంక్ సింగ్ 26 (నాటౌట్), సామ్ కరన్ 27(నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు.

ఓపెనర్లు అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్‌లు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రహానె 5 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. అయితే తర్వాత వచ్చిన శివమ్ దూబె (0), రవీంద్ర జడేజా (2) విఫలమయ్యారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. సమీర్ రిజ్వి (21), మొయిన్ అలీ (15), ధోనీ (14) చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News