Wednesday, January 22, 2025

IPL 2024: రాజస్థాన్ పై చెన్నై విజయం

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(47), యశస్వి జైస్వాల్‌‌(24), జోస్ బట్లర్(21), ధృవ్ జురెల్(28) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో సిమర్‌జిత్‌ 3, దేశ్‌పాండే 2 వికెట్లు తీసుకున్నారు.

అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి.. 18.2 ఓవర్లలో 145 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర(27), రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్), డారిల్ మిచెల్(22), శివం దూబే(18) పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్ పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News