Monday, December 23, 2024

ఢిల్లీ ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ ఫ్రెజర్ (23) పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 4 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 66 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి ఆడిన పంత్ 43 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ట్రిస్టన్ స్టబ్స్ ఏడు బంతుల్లోనే అజేయంగా 26 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ సాహా (39), సాయి సుదర్శన్ (65), డేవిడ్ మిల్లర్ (55) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News