Friday, December 20, 2024

రాజస్థాన్‌కు షాకిచ్చిన ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఓపెనర్ జాక్ ఫ్రెజర్ 20 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అభిషేక్ పొరెల్ 30 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ సంజు శాంసన్ (86) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News