Thursday, January 23, 2025

IPL 2024: చివర్లో చెలరేగిన అభిషేక్.. పంజాబ్ లక్ష్యం 175

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో భాగంగా చంఢీగర్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రారంభంలో ధాటిగా ఆడిన ఢిల్లీ.. మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఓ దశలో 150 పరుగులు చేయడమే కష్టంగా మారింది.

ఈ క్రమంలో అక్షర్ పటేల్(21), అభిషేక్ పోరెల్(32) ధనాధన్ ఇన్నింగ్ తో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలతో చెలరేగి.. పంజాబ్ బౌలర్లకు ధీటైన సమాధానం చెప్పాడు. ఇక, పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, అర్షత్ పటేల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, హర్ ప్రీత్, రాహుల్ చాహర్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News