Wednesday, January 22, 2025

నేడు ఢిల్లీతో లక్నో కీలక పోరు.. గెలిస్తేనే ముందుకు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు మంగళవారం ఢిల్లీతో ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్‌కు మార్గాన్ని సుగమం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అక్నో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందాల్సి ఉంది. ఢిల్లీ ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడగా అందులో ఆరింటిలో గెలుపొంది, ఏడింటిలో ఓటమిపాలైంది. దీంతో ఢిల్లీకి ప్లేఆఫ్ ఆవకాశాలు లేవనే చెప్పాలి. ఇక లక్నోలు 12 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించింది.

మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో మిగిలిన రెండింటిలో విజయం సాధిస్తే ప్లేఫ్ రేసులో నిలిచే ఛాన్స్ ఉంది. దీంతో లక్నో ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జరిగిన పోరులో ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఢిల్లీతో నేడు జరిగే పోరు కీలకంగా మారింది. ఇక ఢిల్లీ ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా, చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా గెలిచి ఈ సీజన్ నుంచి నిష్క్రమించాలనే యోచనలో ఉంది. వరుస ఓటములతో సతమతమవుతన్న ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్‌లో హోరాహోరీ ఖాయంగానే కనిపిస్తోంది.

లక్నోకు కీలకమే..
మరోవైపు లక్నోకు కూడా ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో లక్నో 10 వికె ట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు కీలకంగా తయారైంది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ రాహుల్‌పై నెలకొంది.

రాహుల్ ఈ మ్యాచ్‌లో జట్టుకు కీలకంగా మారాడు. అతను రాణిస్తేనే జట్టుకు మెరుగైన స్కోరు సాధ్యమవుతోంది. మార్కస్ స్టోయినిస్ ఫామ్‌లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశం గా చెప్పొచ్చు. దీపక్ హుడా, పూరన్, కృనాల్, బడోని తదితరులు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇది జట్టు ను కలవరానికి గురి చేస్తోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో వీరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. అప్పుడే లక్నోకు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

స్టార్ ఆటగాళ్లున్నా..
ఢిల్లీ జట్టులో ఒంటి చేత్తో మ్యాచ్‌ను తారుమారు చేసే బ్యాటర్లు ఉన్నా ఎవరూ రాణించలేకపోతున్నారు. ఓపెనర్ పృథ్వీ షా, షాయ్ హోప్, అభిషేక్ పొరెల్ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. పృథ్వీషాకు వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. పొరెల్‌ది కూడా ఇదే పరిస్థితి. హోప్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లోనైనా కీలక ఆటగాళ్లు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు కీలకంగా మారాడు. ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ తదితరులు కూడా బ్యాట్‌ను ఝులిపించక తప్పదు. అప్పుడే ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఇక ఒక మ్యాచ్ నిషేధం అనంతరం జట్టులో చేరనున్న రిషభ్ పంత్ రాకతో ఢిల్లీ గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపిఎల్ కోడ్ ఉల్లఘనకు కారణంగా రిషభ్‌కు రూ.12 లక్షలు జరిమానా, ఓ మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో రిషభ్ ఆడలేదు. దీంతో ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News