Sunday, January 5, 2025

ఐపిఎల్ ఫైనల్స్ కు వాన ముప్పుందా?

- Advertisement -
- Advertisement -

ఒకవేళ ఆట ఆగితే అప్పుడు ఏమిటి?

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ఫైనల్స్ నేడు సాయంత్రం జరుగబోతోంది. క్రికెట్ క్రీడాభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. కానీ వరుణ దేవుడు ఏమి నిర్ణయించనున్నాడో వారికి తెలియదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న(శనివారం) రెస్ట్ తీసుకుంది. కాగా శనివారం వాన కోల్ కతా నైట్ రైడర్స్(కెకెఆర్) ప్రాక్టీస్ సెషన్ ను ఆపేసింది.

ఆక్యూవెదర్ ప్రకారం చెన్నై ఆదివారం 37/31 అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతను కలిగి ఉంది. చెన్నై తీరంలో గంటకు 19 కిమీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ 51 శాతం ఉంది. ఫైనల్ మ్యాచ్ డే నాడు వాన పడే సూచనలు లేనప్పటికీ,  ఒకవేళ పడితే మాత్రం ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే (మే 27కు ) కంటిన్యూ కాగలదు.

ఆట జరిగితే మాత్రం ఐపిఎల్ ఫైనల్ పిచ్ నంబర్ 4లో జరుగనున్నది. అది రెడ్ సాయిల్ వికెట్ పిచ్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News