Monday, December 23, 2024

IPL 2024: ముంబైకి గుజరాత్ షాక్..

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ 17వ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుపుతో ప్రారంభంచింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బ్యాటింగ్ బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన రాజస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో ముందు 194 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన రాజస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 173 పరుగులకే కట్టడి చేసింది. భారీ లక్ష చేధనకు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లకు కేవలం 173 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (64 నాటౌట్), కెఎల్ రాహుల్ (58) రాణించినప్పటికీ మ్యాచ్‌ను నిలుపుకోలేక పోయింది.

ఇక ఓపెనర్ క్వింటాన్ డికాక్ (4) పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఆ తర్వాత దేవ్ దత్ పడిక్కల్ డకౌట్ వెనుదిరిగాడు. ఆయూష్ బదోని ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. దీపక్ హుడా (26), కృనాల్ పాండ్యా (3), స్టోయినీస్ (3) పరుగులు మాత్రమే చేశారు. రాజస్థాన్ బౌలింగ్‌లో మెరుపులాంటి బంతులతో లక్నోను కష్టాల్లోకి నెట్టిన ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. నాండ్రే బర్గర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టి రాజస్థాన్ గెలుపులో కీలక భూమిక పోషించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. జోస్ బట్లర్ 11 పరుగులే చేసి ఔట్ అయ్యాడు . కెఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి వెనెదిరిగాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శాంసన్(82)తో కలిసి యశస్వీ జైస్వాల్ (24) బౌండరీల మోత మోగించాడు. ఐదో ఓవర్‌లో జైస్వాల్ ఔటైనప్పటికీ రాజస్థాన్ పవర్‌ప్లేలో 54 పరుగులు బాదింది. కాగా, నాలుగో స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్‌తో అచితూచి ఆడుతూ రాజస్థాన్ స్కోర్ బోర్డును చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఈ క్రమంలో 33 బంతుల్లో శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. శాంసన్‌కు తోడుగా రియాన్ కూడా దూకుడు పెంచడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి పరాగ్ వికెట్లముందు దొరికి పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మెయిర్ సయితం 5 పరుగులే చేసి వెనుదిరిగాడు. అనంరతం బ్యాటింగ్‌కు వచ్చిన యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (20)తో కలిసి సంజు శాంసన్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీనుల్ హక్ 2 వికెట్లు, మోహ్సిన్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News