Saturday, April 5, 2025

IPL 2024: చెలరేగిన గిల్.. పంజాబ్ కు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

పంజాబ్ జట్టుతో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మెన్లు చెలరేగారు. దీంతో గుజరాత్, పంజాబ్ జట్టుకు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్(89 నాటౌట్) భారీ అర్థశతకంతో చెలరేగాడు.

కేన్ విలియ‌మ్స‌న్(26) పర్వాలేదనిపించగా.. సాయి సుద‌ర్శ‌న్‌(33) ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక, చివర్లో రాహుల్ తెవాటియా(23 నాటౌట్) మెరుపు బ్యాటింగ్ రాణించాడు. పంజాబ్ బౌలర్లలో ర‌బ‌డ రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా.. హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్ లు చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News