Wednesday, December 25, 2024

కోల్కతాతో మ్యాచ్ రద్దు.. ఐపిఎల్ టోర్నీ నుంచి గుజరాత్ ఔట్

- Advertisement -
- Advertisement -

గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అహ్మదాబాద్ ఎడతెరిపి లేని వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు వేచి చూసినా.. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయిట్ ఇచ్చారు. దీంతో గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ ల్లో 5 గెలిచి 11 పాయింట్లతో ఉంది. గుజరాత్ తర్వాతి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచినా 13 పాయింట్లు అవుతాయి. దీంతో అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది గుజరాత్. ఇక, 19 పాయింట్లు సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News