Thursday, January 23, 2025

ఐపిఎల్ 2024: లక్నోను చిత్తుగా ఓడించిన కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఐపిఎల్ సీజన్17లో కోల్‌కతా నైట్‌రైజర్స్ జోరు కొనసాగుతోంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నైట్‌రైడర్స్‌కు ఇది నాలుగో విజయం కావడం విశేషం. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 15.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సునీల్ నరైన్ ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్‌క్రిష్ రఘువంశీ (7) కూడా విఫలమయ్యాడు. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

శ్రేయస్ సమన్వయంతో ఆడగా ఫిలిప్ దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు లక్నో బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సాల్ట్ 47 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ ఆరు ఫోర్లతో 38 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను కెప్టెన్ రాహుల్ (39), నికోలస్ పూరన్ (45) ఆదుకున్నారు. మిగతా వారిలో ఆయూష్ బడోని (29) పరుగులు సాధించాడు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News