Monday, December 23, 2024

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా మరో ఆసక్తిక మ్యాచ్ జరుగుతుంది. వైజాగ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌క‌తా బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌క‌తా.. ఢిల్లీని ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇక, గత మ్యాచ్ లో చెన్నైపై ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఇందులో గెలుపొంది సత్తా చాటాలని పట్టదలగా ఉంది. కాగా, ఇరుజ‌ట్లు స్వల్ప మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి.

జట్ల వివరాలు:

ఢిల్లీ: డేవిడ్ వార్న‌ర్, పృథ్వీ షా, రిష‌భ్ పంత్(కెప్టెన్), మిచెల్ మార్ష్, టిట్స‌న్ స్ట‌బ్స్, అక్ష‌ర్ ప‌టేల్, సుమిత్ కుమార్, ర‌సిఖ్ దార్ స‌లామ్, అన్రిచ్ నోర్జియా, ఇషాంత్ శ‌ర్మ‌, ఖ‌లీల్ అహ్మ‌ద్.

కోల్‌క‌తా: ఫిలిఫ్ సాల్ట్, వెంక‌టేశ్ అయ్య‌ర్, ఆండ్రూ ర‌స్సెల్, నితీశ్ రానా, శ్రేయ‌స్ అయ్య‌ర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ, సునీల్ న‌రైన్, ర‌మ‌న్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News