Monday, December 23, 2024

IPL 2024: లక్నోతో పోరు.. బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 2024 లీగ్ దశలో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మరికొద్దసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా లక్నో బ్యాటింగ్ చేయనుంది.

ప్రస్తుతం ఇరు జట్లు మూడేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. గత మ్యాచుల్లో చెన్నై చేతిలో కోల్‌కతా, ఢిల్లీ చేతిలో లక్నోలు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి స్థితిలో రెండు జట్లు కూడా ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థితిలో నిలవాలనే పట్టుదలతో ఉన్నాయి.

 జట్ల వివరాలు

లక్నో జట్టు: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్ (w/c), దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్

కోల్‌కతాజట్టు: ఫిలిప్ సాల్ట్(w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(c), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News