Saturday, April 5, 2025

IPL 2024: ఆదుకున్న పూరన్.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 2024 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. దీంతో కోల్‌కతాకు లక్నో 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి161 పరుగులు చేసింది.

నికోలస్ పూర్ 45 పరుగులు, కెఎల్ రాహుల్ 39 పరుగులు, అయుష్ బదోని 29 పరుగులు చేశారు. మిగతావారు విఫలం కావడంతో తక్కువ స్కోరే పరిమితమైంది లక్నో. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అడ్రూ రస్సెల్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News