Monday, December 23, 2024

దంచికొట్టిన ఇషాన్, సూర్య.. ముంబైకి రెండో గెలుపు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇషాన్ కిషన్(69), రోహిత్ శర్మ(38), సూర్యకుమార్ యాద వ్(52) మెరుపు బ్యాటింగ్ ముందు బెంగళూరు నిర్దేశించిన లక్షం చిన్నదైంది. పోర్లు, సిక్సర్లతో ముంబై బ్యాటర్లు విజృంభించడంతో కేవలం 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో ఐపిఎల్ 17 సీజన్‌లో ముంబై రెండో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు.

విరాట్ కో హ్లీ(3), వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్(8) వెనువెంటనే ఔటై పెవిలియన్ చేరారు. దీంతో బెంగళూరు బ్యాటర్లు పరుగుల తీయడంలో కాస్త ఇబ్బందిపడ్డారు. ఇక కెప్టెన్ డుప్లిసిస్(61) రాణించగా రజత్ పాటిదార్(50), అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఇక చివరలో వచ్చిన దినేశ్ కార్తీక్(53) 23 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది బెంగళూరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News