- Advertisement -
ఐపీఎల్ 17లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు పూర్తి విఫలమయ్యారు. దీంతో ముంబై, లక్నోకు 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి లక్నో బౌలర్లు షాకిచ్చారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగడంతో ముంబై బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.
రోహిత్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(10), తిలక్ వర్మ(7), హార్దిక్ పాండ్యా(0)లు విఫలమయ్యారు. ఇషాన్ కిషన్(32), నేహల్ వధేరా(46), టిమ్ డేవిడ్(35 నాటౌట్)లు మాత్రమే రాణించారు. దీంతో 20 ఓవర్లలో ముంబై 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
- Advertisement -