- Advertisement -
చండీగఢ్: ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ముంబై ఇండియన్స్ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్ శర్మ(36) పర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్(78)లు అర్థశతకంతో మెరిశాడు. చివర్లలో తిలక్ వర్మ(34నాటౌట్), టిమ్ డేవిడ్(14)లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఇక, పంజాబ్ బౌలర్లలో అర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. శామ్ కరన్ రెండు వికెట్లు, రబాడ ఒక వికెట్ పడగొట్టాడు.
- Advertisement -