Friday, December 20, 2024

చెలరేగిన ముంబై బ్యాట్స్ మెన్స్.. ఢిల్లీకి భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీతో జరుగుతున్న ముంబై బ్యాట్స్ మెన్స్ రాణించారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేబట్టిన ముంబై, ఢిల్లీ జట్టుకు 235 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా(39) పర్వాలేదనిపించినా.. చివర్లో టిమ్ డేవిడ్(45 నాటౌట్), రొమారియో షెపర్డ్(39 నాటౌట్)లు మెరుపులు మెరిపించారు.

లాస్ట్ ఓవర్ లో 4, 6, 6, 6,4, 6 బౌండరీలతో షెపర్డ్, ఢిల్లీ బౌలర్ కు చక్కులు చూపెట్టాడు. చివరి ఓవర్లలో ముంబైకి ఏకంగా 32 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై జట్టు నిర్టీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జేలు చెరో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News