Thursday, December 19, 2024

IPL 2024: కోల్ కతా vs ముంబై.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌..వర్షం కురుస్తుండడంతో ఆలస్యంగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి కోల్‌కతాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో టాస్ ఆలస్యం కానుంది. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఆగినా.. కవర్లపై నీరు నిలవడంతో స్టేడియాన్ని సిద్ధం చేసేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది.

కాగా, ఇప్పటివరకూ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన కోల్ కతా పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. మరోవైపు ముంబై 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 9వ స్థానంలో ఉంది. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News