Saturday, December 21, 2024

19న ఐపిఎల్ ఆటగాళ్ల వేలం

- Advertisement -
- Advertisement -

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2024 సీజన్‌కు సంబంధించి వేలం పాటకు తేదీ ఖరారు చేశారు. ఈ మెగా వేలాన్ని ఈనెల 19న నిర్వహించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అయితే ఈ వేలం ప్రక్రియకు దుబాయ్ వేదక కానుంది. అయితే గత నెలలో ముగిసిన ఐపిఎల్ రిటెన్షన్ తర్వాత 1,166 మంది ఆటగాళ్లు వేలంలో రిజిష్టర్ చేసుకున్నారు. వీరిలో వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ నుంచి ట్రావీస్ హెడ్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లపై భారీ ఆశలున్నాయి. న్యూజిలాండ్ రచిన్ రవీంద్రతో పాటు డారెల్ మిచెల్ కూడా భారీ ధర దక్కించుకుంటారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వేలానికి పేరు నమోదుచేసుకున్నవారిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా 336 మంది ఓవర్సీస్ ప్లేయర్లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News