Monday, December 23, 2024

IPL 2024: ఐపిఎల్ లో బోణీ కొట్టిన పంజాబ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. శనివారం చంఢీగర్ లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విధించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లలో శ్యామ్ కరన్(63) అర్థశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఆరంభంలో ఓపెనర్ శిఖర్ ధావన్(22), ప్రభ్ సిమ్రాన్ సింగ్(26) ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక, చివర్లలో లివింగ్ స్టన్(38 నాటౌట్) రాణించడంతో పంజాబ్ ఘన విజయం సాధించింది.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(29), మిచెల్ మార్ష్(20), హై హోప్(33)లు పర్వాలేదనిపించగా… అక్షర్ పటేల్(21), అభిషేక్ పోరెల్(32)లు మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నారు.అయితే బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలమవ్వడం.. బౌలర్లు చివర్లలో శృతి తప్పడంతో ఢిల్లీ ఓటమిపాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News