Wednesday, January 22, 2025

IPL 2024: గుజరాత్ పై బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 2024 లీగ్ దశలో భాగంగా అహ్మాదాబాద్‌ వేదికగా గుజ‌రాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైన గుజరాత్ జట్టు.. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు పంజాబ్.. గుజరాత్ ను ఓడించి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు

పంజాబ్:  శిఖ‌ర్ ధావ‌న్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్, సామ్ క‌ర‌న్, శ‌శాంక్ సింగ్, సికింద‌ర్ ర‌జా, హ‌ర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ర‌బాడ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్.

గుజ‌రాత్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్), శుభ్‌మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్, కేన్ విలియ‌మ్స‌న్, విజ‌య్ శంక‌ర్, అజ్మ‌తుల్లా ఓమ‌ర్‌జాయ్, రాహుల్ తెవాటియా, ర‌షీద్ ఖాన్, నూర్ అహ్మ‌ద్, ఉమేశ్ యాద‌వ్, ద‌ర్శ‌న్ న‌ల్కందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News