Tuesday, December 24, 2024

IPL 2024: తడబడిన పంజాబ్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ లో విఫలమైంది. దీంతో రాజస్థాన్ జట్టుకు కేవలం 148 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

జితేష్ శర్మ(29), లివింగ్ స్టన్(21), అశుతోష్ శర్మ(31 నాటౌట్)లు రాణించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలం కావడంతో పంజాబ్.. 150 పరుగులు స్కోరు కూడా చేయలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్, మహరాజ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, కుల్దీప్ సేన్, చాహల్ లు తలో తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News