Sunday, January 19, 2025

IPl 2024: ముంబైపై బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ములాన్‌పూర్ లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని.. ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ఐపిఎల్ లో ఇప్పటివరకు ఇరుజట్లు ఆరేసి మ్యాచ్ లు ఆడగా.. చెరో రెండు మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8, 9వ స్థానాల్లో ఉన్న పంజాబ్, ముంబై జట్లు.. మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్లమవుతాయి.

జట్ల వివరాలు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రిలీ రోసౌవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్(సి), జితేష్ శర్మ(w), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News