Sunday, December 22, 2024

నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీ.. ఆర్సీబి బోణీ కొడుతుందా?

- Advertisement -
- Advertisement -

IPL 2024లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్, ఆర్సిబి జట్లు ఢీకొనబోతున్నాయి. ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై చేతిలో ఓటమిపాలైన బెంగళూరు.. ఈ మ్యాచ్ లో గెలిచి మెగా టోర్నీలో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం ఆర్సీబికి కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు జరిగిన హోం గ్రౌండ్ మ్యాచ్ లలో ఆయా జట్లు విజయం సాధించాయి.

ఇక, తొలి మ్యాచ్ లో ఢిల్లీపై ఘన విజయం సాధించిన పంజాబ్ జట్టు అదే జోష్ లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News