Sunday, December 22, 2024

IPL 2024: మ్యాచ్ జరుగుతుండగా కొట్టకున్న రోహిత్, పాండ్యా ఫాన్స్(వీడియో)

- Advertisement -
- Advertisement -

స్టేడియంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టుకున్నారు. IPL 2024 లీగ్ దశలో భాగంగా ఆదివారం రాత్రి ఆహ్మదాబాద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతుండగా.. మ్యాచ్ చేసేందుకు వచ్చిన రోహిత్, హార్దిక్ అభిమానుల మధ్య మాటా మాటా పెరిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2023 సీజన్ వరకు ఐపిఎల్ లో ముంబైకి సారథ్యం వహిస్తూ వస్తున్న రోహిత్.. ఇప్పటికే ఐదు టైటిల్ జట్టుకు అందించిన సంగతి తెలిసిందే. అయితే, 2024 ఐపిఎల్ ప్రారంభానికి ముందే ఉన్నట్టుండి రోహిత్ శర్మను తప్పిస్తూ.. గుజరాత్ కెప్టెన్ గా ఉన్న పాండ్యాను తీసుకొచ్చి ముంబై జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు. దీన్ని జీర్ణించుకోలేక రోహిత్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తూ ముంబై జర్సీలను తగలబెట్టారు. అప్పటి నుంచి పాండ్యాకు వ్యతిరేకంగా రోహిత్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో తమ నిరసన తెలిపారు.

కాగా, నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్  లో రోహిత్ శర్మ 43 పరుగులతో రాణించగా.. పాండ్యా 11 పరుగులు చేసి కీలక దశలో ఔటై నిరాశపర్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News