Monday, December 23, 2024

IPL 2024: గుజరాత్ పై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు సారథి డు ప్లెసిస్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

ఇప్పటివరకూ 10 మ్యాచ్‍ల్లో ఆడిన బెంగళూరు మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఇక, గుజరాత్ 10 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

జట్ల వివరాలు:

బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.

గుజరాత్: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News