Monday, January 20, 2025

IPL 2024: చివరి లీగ్ మ్యాచ్ లో అగ్ర జట్ల మధ్య పోరు

- Advertisement -
- Advertisement -

గౌహతి: ఐపిఎల్‌లో ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌ను రిహార్సల్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య గౌహతి వేదికగా మ్యాచ్ జరుగనుంది. కోల్‌కతా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్‌లో ఓడినా కోల్‌కతా అగ్రస్థానానికి ఢోకా ఉండదు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచినా రెండో స్థానంతోనే సరిపెట్టుకోక తప్పదు. ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్ ఆ తర్వాత పేలవమైన ప్రదర్శన నిరాశ పరిచింది. చివరగా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుస ఓటములను చవిచూసింది.

కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. కానీ చిరస్మరణీయ ఆటతో ఈ సీజన్‌లో పెను సంచలనం సృష్టిస్తున్న కోల్‌కతాను ఓడించాలంటే రాజస్థాన్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్ పోరుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News