Friday, January 10, 2025

ఐపిఎల్ 2024: లక్నోపై రాజస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురేలేకుండా పోయింది. వరుస విజయాలతో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ మరో విజయాన్ని నమోదు చేసి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. శనివారం లక్నో సూపర్ జాయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

జోస్(34), సంజూసామ్‌సన్(71), దృవ్ జురెల్(52) బ్యాట్ ఝలిపించడంతో లక్నో నిర్ధిశించిన 197 పరుగుల భారీ లక్షాన్ని మరో ఆరు బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో సంజుసామ్సన్, దృవ్ జురెల్‌లు నాలుగో వికెట్‌కు 117 పరుగుల భాగస్వాయ్యం నెలకొల్పడంతో అరుదైన రికార్డును వారు సొంతం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News