Sunday, December 22, 2024

IPL 2024: ఐపిఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సంజూ శాంసన్ రికార్డు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్ చరిత్రలోనే వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నయా రికార్డును సాధించాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా సంజూ శాంసన్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లపై విరుచుకు పడిన శాంసన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 చేసి అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

2020 నుంచి సంజూ శాంసన్ ప్రతీ సీజన్ తొలి మ్యాచ్‌లో 50 పైగా పరుగులు చేస్తూ వస్తున్నాడు. ఐపిఎల్ 2020 సీజన్ తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన సంజూ.. 2021 ఫస్ట్ మ్యాచ్‌లో(119) సెంచరీ బాదాడు. 2022 సీజన్ తొలి మ్యాచ్‌లో 55 పరుగులు, 2023 సీజన్‌లో 55 పరుగులు, తాజాగా 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపిఎల్ చరిత్రలోనే మరే బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News