Wednesday, January 22, 2025

ఐపిఎల్ షెడ్యూల్ ఖారారు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్17 షెడ్యూల్ ఖరారైంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఐపిఎల్ తొలి విడత మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ క్రమంలో మొత్తం 21 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మార్చి 22న చెన్నైలో తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, విశాఖపట్నం, ముంబై నగరాల్లో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి తమ హోం గ్రౌండ్‌గా విశాఖపట్నంను ఎంచుకుంది.

ఢిల్లీకి సంబంధించిన హోం గ్రౌండ్ మ్యాచ్‌లు విశాఖలో జరుగుతాయి. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, ఐపిఎల్ మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఎన్నికల తర్వాత మిగతా మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బిసిసిఐ కార్యదర్శి జైషా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈసారి ఐపిఎల్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని జైషా వెల్లడించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తామని జైషా గతంలో ప్రకటించారు.

ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లు
ఐపిఎల్ సీజన్17కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు రెండు మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం లభించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 27న ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 5న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో చెన్నైహైదరాబాద్ జట్లు తలపడుతాయి. హైదరాబాద్‌కు రెండు మ్యాచ్‌లు కేటాయించడంపై హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఆనందం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో మ్యాచ్‌లను కేటాయించిన బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాతో పాటు ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మ్యాచ్‌లను విజయం నిర్వహిస్తామనే నమ్మకాన్ని జగన్‌మోహన్ రావు వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News