Sunday, January 19, 2025

IPL 2024: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ లో సన్ రైజర్ చరిత్ర సృష్టించింది. సోమవారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్స్ మెన్స్ పెన విధ్వంసం సృష్టించారు. బెంగళూరు బౌలర్లను ఊతికారేశారు. భారీ సిక్సులు, ఫోర్లతో చుక్కలు చూపించారు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో బెంగళూరు ప్లేయర్స్ ప్రేక్షపాత్ర పోహించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఏకంగా 287 పరుగులు సాధించి రికార్డు సృస్టించింది.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్ రైజర్స్.. గతంలో ఆర్సీబీ(262 పరుగుల)పై ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. తాజాగా బెంగళూరుపై 287 పరుగులతో తన రికార్డును తనే బద్దలు కొట్టింది. ఒకే సీజన్ లో రెండుసార్లు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది సన్ రైజర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News