- Advertisement -
ఐపిఎల్ లో సన్ రైజర్ చరిత్ర సృష్టించింది. సోమవారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్స్ మెన్స్ విధ్వంసం సృష్టించారు. ఏకంగా బెంగళూరుకు 288 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు సాధించి రికార్డు సృస్టించింది. ట్రావిస్ డేవిడ్(102) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. ఇక, క్లాసన్(67), మార్ క్రమ్(32 నాటౌట్), సమద్(37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ ఐపిఎల్ అత్యధిక పరుగులు చేసింది. దీంతో ఐపిఎల్ తన రికార్డును తనే బద్దలు కొట్టింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో 277 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -